రూ.50 వేలు ఇస్తేనే కొడుకు మృతదేహం అప్పగిస్తం

 రూ.50 వేలు ఇస్తేనే కొడుకు మృతదేహం అప్పగిస్తం

‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు....మచ్చుకైనా లేడు చూడు...మనిషనేటోడు’ అని ఓ సినీ గేయంలో చెప్పిన మాదిరిగానే బిహార్ లో ఓ ఘటన జరిగింది. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన కొడుకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకు మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. వైద్య ఖర్చుల కింద రూ.50 వేల వరకు అయ్యాయని.. డబ్బులు కట్టి కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లాలని సదరు ఆస్పత్రి సిబ్బంది సూచించారు. అంత డబ్బు కట్టే స్థోమత లేని తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు జోలె పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ డబ్బుల కోసం అర్థించారు. తల్లిదండ్రుల బాధను చూసి చలించిన ప్రజలు తమకు తోచిన విధంగా సాయం చేశారు. ఆ తల్లిదండ్రుల హృదయ విధాకర ఘటనన చూసిన ప్రతి ఒక్కరూ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 వేల కోసం ఆ నిరుపేద తల్లిదండ్రులకు కొడుకు మృతదేహాన్ని ఇవ్వకుండా నరకం చూపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.