బిహార్ లో లిక్కర్ పై ఉక్కుపాదం

బిహార్ లో లిక్కర్ పై ఉక్కుపాదం

బిహార్ లో లిక్కర్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. మద్య నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలన్న సీఎం నితీశ్ కుమార్ ఆదేశాలతో తనిఖీలు విస్తృతం చేశారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో లిక్కర్ వినియోగం జరుగుతోందన్న సమాచారంతో... కళ్యాణ మండపాలు, హోటల్స్ లో తనిఖీలు చేస్తున్నారు. ఓ కళ్యాణ మండపంలో పోలీసులు తనిఖీ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వధూవరుల రూమ్స్ తో పాటు, బంధువులు, పెళ్లికి వచ్చినవారి గదులు, లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఈ చర్యలను నితీశ్ కుమార్ సమర్థించారు. లిక్కర్ తీసుకోనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.