V6 News

బీహార్లో టెట్ అభ్యర్థులపై లాఠీచార్జ్

బీహార్లో టెట్ అభ్యర్థులపై లాఠీచార్జ్

బీహార్ లో టెట్ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన అభ్యర్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

టెట్ నిర్వహించి ఏండ్లు గడుస్తున్నా.. టీచర్ పోస్టులకు ఇప్పటికీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించకపోవడంతో లాఠీచార్జ్ చేశారు.