
షాకింగ్ న్యూస్.. అమెరికా గన్ కల్చర్.. బీహార్ కూడా పాకిందా.. నర్సరీ స్టూడెంట్.. పట్టుమని ఐదేళ్లు కూడా ఉండవు.. వాడి చేతిలో గన్.. తోటి విద్యార్థులపై కాల్పులు.. ముగ్గురికి గాయాలు.. నమ్మలేకుండా ఉన్నారా.. ఇది నిజం.. బీహార్ లో ఓ స్కూల్ లో జరిగిన సంఘటన.. ఏంజరిగింది?వివరాల్లోకి వెళితే..
బీహార్ లోని సుపాల్ జిల్లాల్లో బుధవారం జూలై 31, 2024న జరిగిన షాకింగ్ ఘటనలో ఐదేళ్ల బాలుడు తుపాకీతో పాఠశాలకు వెళ్లి మరో చిన్నారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు చెబుతున్నారు. నర్సరీ విద్యార్థి అయిన బాలుడు తన బ్యాగ్ లో తుపాకీని దాచుకుని పాఠశాలకు వెళ్లాడు. త్రివేణిగంజ్ లోని సెయింట్ జాన్స్ బోర్డిం గ్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.గాయపడిన బాలుడిని ఆసిఫ్ గా గుర్తించారు. చికిత్స కోసం ఆసిఫ్ ను త్రివేణి గంజ్ లోని సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కలత చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులు లాల్పట్టి గ్రామం వద్ద సుమారు అరగంటపాటు జాతీయ రహదానరిని దిగ్బంధించి నిరసన తెలిపారు.నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. దిగ్బంధనం తొలగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు ప్రారంభించారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంత పెద్ద నిర్లక్ష్యం ఎలా జరిగిందంటూ.. పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అదే స్కూల్లో మూడో తరగతి చదువుతున్న 10ఏళ్ల బాలుడిపై నర్సరీ విద్యార్థి కాల్పులు జరిపాడు.. అతని చేతికి బుల్లెట్ తగిలిందని ఎస్పీ షైషవ్ యాదవ్ ఘటనపై వివరించారు. ఈ ఘటన తల్లిదండ్రులలో చాలా ఆందోళన కలిగిస్తోంది.. ప్రతి రోజు విద్యార్థుల బ్యాగులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని పాఠశాల యాజమాన్యాలకు ఆర్డర్ పాస్ చేసినట్లు పోలీసులు చెప్పారు.