ఆర్జేడీ, కాంగ్రెస్‌‌తో బిహార్‌‌‌‌కు తీరని నష్టం.. అభివృద్ధిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు: మోదీ

ఆర్జేడీ, కాంగ్రెస్‌‌తో బిహార్‌‌‌‌కు తీరని నష్టం.. అభివృద్ధిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు: మోదీ
  • రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తరు
  • ఇప్పటివరకూ 4 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చామని వెల్లడి
  • బిహార్‌‌‌‌లోని పూర్నియాలో టూర్
  • సీమాంచల్​ ప్రాంతంలో తొలి ఎయిర్‌‌‌‌పోర్ట్​ ఓపెన్​

పాట్నా: ఆర్జేడీ, కాంగ్రెస్​ అస్తవ్యస్త పాలనతో బిహార్‌‌‌‌కు తీరని నష్టం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీయే హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారు ఓర్వలేకపోతున్నారని అన్నారు.   సోమవారం బిహార్‌‌లోని పూర్ణియా జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు. జాతీయ పూల్​మఖానా బోర్డుతోపాటు రూ. 36 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.  రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు బిహార్‌‌‌‌ తల్లులు, సోదరీమణులు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. దేశ అభివృద్ధి, భద్రతలో బిహార్​ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను పట్టించుకోరని, తమ కుటుంబాల గురించే ఆరాటపడతారని విమర్శించారు. కానీ తాను ‘సబ్​కా సాథ్​ సబ్​ కా విశ్వాస్’ను  నమ్ముతానని చెప్పారు. పేద ప్రజలకు మద్దతు ఇవ్వడమే తన మోటో అన్నారు. ఇందులో భాగంగానే పేద ప్రజలకు ఇప్పటివరకూ 4 కోట్ల పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. త్వరలో మరో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. రైతులకు ప్రయోజనం కల్గించేందుకు జాతీయ పూల్​ మఖానా బోర్డు ఏర్పాటుకు 
కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.

చొరబాటుదారులు వెళ్లిపోవాల్సిందే..

రాష్ట్రంలోకి చొరబాటుదారులను ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. కానీ, న్డీయే సర్కారు వారిని తరిమికొడ్తుందని చెప్పారు. బిహార్​లో ఎన్నిక‌‌ల సంఘం చేప‌‌ట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌‌ఐఆర్‌‌)ను ఓటు బ్యాంకు రాజ‌‌కీయాల కోసమే ఆర్జేడీ, కాంగ్రెస్​ వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. బిహార్ గుర్తింపును కూడా ఆ పార్టీలు నాశ‌‌నం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి చొర‌‌బాటుదారులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. విదేశాల నుంచి వచ్చిన వారి కోసం ఇలాంటి యాత్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బిహార్​ ప్రజలు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు. చొర‌‌బాటుదారులు ఎవ‌‌రైనా వెళ్లిపోవాల్సిందేనని హెచ్చరించారు. 

సీమాంచల్​లో తొలి ఎయిర్‌‌‌‌పోర్ట్​ ప్రారంభం

బిహార్‌‌‌‌లోని సీమాంచల్​ ప్రాంతం  పూర్నియాలో ఏర్పాటుచేసిన ఫస్ట్​ ఎయిర్‌‌‌‌పోర్ట్​ను మోదీ ప్రారంభించారు. తర్వాత ఎయిర్‌‌‌‌పోర్ట్​ టర్మినల్​ బిల్డింగ్‌‌ను ఆయన సందర్శించారు. ఈ గ్రీన్‌‌ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్‌‌ను ఉడాన్​స్కీమ్​కింద ఏర్పాటు చేశారు.  ఇది సీమాంచల్ ప్రాంతంలో మొట్టమొదటి ఎయిర్‌‌పోర్ట్.  ఇది  ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేసి, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి 
తోడ్పడనున్నదని ఎన్డీయే సర్కారు చెబుతున్నది.

బిహార్‌‌‌‌ ప్రజలను బీడీలతో పోలుస్తూ అవమానిస్తున్నరు

బిహార్​ ప్రజలను బీడీలతో పోలుస్తూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అవమానిస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు.  కాంగ్రెస్ కేరళ యూనిట్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ నుద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.  పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ విధానాన్ని టార్గెట్​ చేస్తూ కాంగ్రెస్​ కేరళ యూనిట్ ఓ ట్వీట్​ చేసి తర్వాత డిలీట్ కొట్టింది. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘ఇది బిహార్‌‌‌‌ను, రాష్ట్ర ప్రజలను అవమానించడమే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి రాష్ట్ర ప్రజలు తగిన జవాబిస్తారు” అని వ్యాఖ్యానించారు.