బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ(మంగళవారం) అరరియా జిల్లాలోని ఫోర్బ్స్‌గంజ్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మాట్లాడిన మోడీ…..బీహార్‌లో మళ్లీ ఎన్డీయేను విజయం సాధిస్తుందన్నారు. బీహారీ ప్రజలు మళ్లీ NDAకే పట్టం కట్టనున్నట్లు తెలిపారు. ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే ఉదయం 10 గంటల వరకే అత్యధిక పోలింగ్ జరిగిందన్నారు. ఇది కేవలం దేశానికి మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి సందేశం అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న శక్తి అని, ప్రతి బీహారీ ప్రజాస్వామ్యం పట్ల అంకితభావంతో ఉన్నట్లు ప్రధాని తెలిపారు.
