
బీహార్‌లో దారుణం జరిగింది. గయా జిల్లాలో హోంగార్డు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న 26 ఏళ్ల మహిళ అభ్యర్థిపై కదులుతున్న అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం జరిగింది. ఫిజికల్ టెస్ట్ సమయంలో స్పృహ కోల్పోయిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.
జూలై 24న బోధ్ గయాలోని బీహార్ మిలిటరీ పోలీస్ మైదానంలో హోంగార్డు నియామక ప్రక్రియ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల ప్రకారం..నియామకాలలో భాగంగా జరిగే శారీరక దారుఢ్య పరీక్షలో ఆ మహిళ స్పృహ కోల్పోయింది. వెంటనే నిర్వాహకులు అక్కడే సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ లోపల ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది.
ALSO READ : వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
బాధిత మహిళ వాంగ్మూలం ఆధారంగా బోధ్ గయా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT),ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగాయి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కొన్ని గంటల్లోనే అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్ అనే ఇద్దరు అనుమానితులను SIT అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వారిద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అంబులెన్స్ ప్రయాణ మార్గం, సమయాన్ని అధికారులు నిర్ధారించారు.
ఈ సంఘటనపై లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఎంపీ చిరాగ్ పాశ్వాన్ తీవ్రంగా స్పందించారు. బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితిని విమర్శిస్తూ, రాష్ట్ర పోలీసుల పనితీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.