ఆఫీసులకు వెళ్లొస్తూనే.. బైక్​ రైడర్​గా చేస్తున్నరు

ఆఫీసులకు వెళ్లొస్తూనే.. బైక్​ రైడర్​గా చేస్తున్నరు

శాలరీలు సరిపోక అదనపు ఇన్​కమ్​పై ఫోకస్​​
డైలీ రూ.100 నుంచి రూ.300  వరకు ఆదాయం

హైదరాబాద్, వెలుగు: 
సిటీలో ప్రైవేట్​జాబ్​లు చేసేవారు బైక్ రైడర్స్ గా మారుతున్నారు. శాలరీలు  సరిపోక కొందరు, ఉపాధికి ఇంకొందరు, పెట్రోల్ ఖర్చులు తగ్గించుకునేందుకు మరికొందరు ఓలా, ఊబెర్, ర్యాపిడో లాంటి సంస్థల్లో పార్ట్​ టైమ్ జాబర్స్ గా చేస్తున్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే ముందు, సాయంత్రం వచ్చే ముందు పికప్ అండ్​ డ్రాప్స్​ తీసుకుంటున్నారు. బుకింగ్స్​ టైమ్​లో ఏ ఏరియాకి కావాలంటే సంస్థలు ఆ ప్రాంతానికి ఇస్తున్నాయి. దీంతో చాలా మంది జాబర్స్​ పార్ట్​ టైమ్  రైడర్స్​గా చేస్తున్నారు. సిటీలో మొత్తం 26 వేల మంది  ఉండగా, ఇందులో  16 వేల మంది పార్ట్ టైమ్ గా చేసేటోళ్లే ఉన్నారు. కరోనాకు ముందు 7 వేల మంది   పని చేసేవారు. వీరితో పాటు ఏ పనిలేని వారికి కూడా ఉపాధిగా మారింది.  పార్ట్​ టైమ్ గా రూ.100 నుంచి రూ.300 వరకు, ఫుల్​టైమ్ గా రూ.700 నుంచి రూ. వెయ్యికి పైగా సంపాదిస్తున్నారు. యూత్ ​ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.  పెట్టుబడి లేకపోవడంతో పాటు డెలివరీ సంస్థలు కూడా ఆఫర్లు, కమీషన్​ ఇస్తుండగా  బైక్ రైడర్స్​ కి ఫుల్​ డిమాండ్ పెరిగింది.  నాలుగైదు సంస్థల్లో కూడా లాగిన్ ఐడీలను తీసుకొని ఎక్కువ ఇన్​కమ్ ​ఉన్న దాంట్లో జాయిన్ ​అవుతున్నారు. 
ఎలాంటి పెట్టుబడి లేకపోవడంతో..  
  ఏ చిన్న బిజినెస్​ చేయాలన్న కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ మెంట్ ​పెట్టాలి. బైక్ రైడర్ గా అయితే  టూ వీలర్​ఉంటే చాలు. ఐడీ తీసుకుని  రైడ్​​కు వెళ్లొచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని సంస్థలు జాయిన్ ​అయితే చాలు ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. దీంతో చాలా మంది రైడర్స్ గా చేరేందుకు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు.  సిటీలో10 వేల మందికిపైగా ఫుల్​ టైమ్ రైడర్స్​ పని చేస్తున్నారు. జాబ్స్ ​కోల్పోయిన వారు, మానేసిన వారు కూడా ఖాళీగా ఉండలేక రైడ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు.  టైమ్ లేకపోవడంతో ఆఫీసులకు వెళ్లి వచ్చేటప్పుడు  లాగిన్​ అయి బుకింగ్​లను తీసుకుంటు న్నారు. దీంతో అదనపు ఆదాయం వస్తుండగా చాలా మంది రైడర్స్​గా కొత్తగా జాయిన్​అవుతున్నట్లు ఆయా సంస్థల వెండర్స్​చెబుతున్నారు.
 డెలివరీ బాయ్స్​ కి తరహాలో డిమాండ్ 
బైక్ రైడర్స్ తో పాటు సిటీలో డెలివరీ బాయ్స్ కి  డిమాండ్ ఏర్పడింది.10 మినిట్స్​, 30 మినిట్స్​ లో డెలివరీ ఇస్తామంటూ ఆన్ లైన్ సంస్థలు ఏర్పాటవుతుండగా చాలా మందికి ఉపాధి లభిస్తుంది.  ప్రస్తుతం ఏ వస్తువులనైనా ఒకచోట నుంచి మరోచోటకు తెప్పించేందుకు వెళ్లి తీసుకొస్తే టైమ్​ వేస్ట్​ అవుతుందని డెలివరీ సంస్థల యాప్ లను జనాలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉదాహరణకు ఉస్మాన్​గంజ్​లో ఓ వ్యాపారి షాపు తాళాలు ఇంట్లో మరిచిపోయి వెళ్లాడు. ఆయన ఇల్లు మాసబ్ ట్యాంక్ లో ఉండగా, ఆయన వెళ్లి తీసుకొస్తే ఎక్కువ టైమ్​ పడుతుందని ఓ డెలివరీ యాప్​లో బుక్ చేసుకొని 15 నిమిషాల్లో తాళాలను తెప్పించుకున్నాడు.   ఇలా ఏ పనికైనా డెలివరీ యాప్స్ ని బుక్ చేసుకుంటున్నారు. దీంతో నాలుగైదు సంస్థల్లో లాగిన్ ఐడీలు తీసుకొని దేంట్లో బుక్కింగ్స్​వస్తే దాంట్లో పనిచేస్తున్నారు. 

ఆదాయం కోసం .. 
కరోనాతో ఎంతో మంది జాబ్​లు కోల్పోయారు. సిటీలో  ఉండలేక సొంతూళ్లకు వెళ్లి ఏదో ఒక పనిచేసుకుంటూ  ఉండిపోయారు. ప్రస్తుతం జాబ్​లు చేస్తున్న వారికి మెజారిటీ స్థాయిలో రెండేండ్లు సరిగా శాలరీలు పెరగలేదు.  కొన్ని సంస్థలైతే కట్​ చేస్తుండగా, వచ్చిన శాలరీ సరిపోక కొందరు, అదనపు ఆదాయం కోసం ఇంకొందరు బైక్ రైడర్స్​గా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫుల్​టైమ్ రైడర్ గా పనిచేస్తే ప్రస్తుతం పనిచేస్తున్న జాబ్​కంటే ఎక్కువ సంపాదన వస్తుందని, అయినా ఉన్నత చదువులు చదివి  రైడర్​గా పనిచేస్తే ప్యూచర్ ఎలా ఉంటుందోనని జాబ్​తోపాటు పార్ట్​ టైమ్ గా రైడ్ చేస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. 

ఆఫీసుకు వెళ్లేటప్పుడు..
చిన్న కంపెనీలో జాబ్​ చేస్తుండగా, నెలకి 17 వేల శాలరీ వస్తుంది. రేట్లు పెరిగిపోవడంతో ఇల్లు గడవడం కష్టమైతుంది. ఉబెర్​లో రిజిస్టర్ చేసుకుని బైక్​రైడ్​కు వెళ్తున్నా.  మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లేటప్పుడు టోలిచౌకి నుంచి ఖైరతాబాద్ కి రైడ్ ఆన్ చేస్తా. ఆ రూట్ లో వచ్చే రైడ్‌‌‌‌లను యాక్సెప్ట్ చేసి కస్టమర్లను దింపి వెళ్తుంటా.  పెట్రోల్ ఖర్చు పోయి  కొంత అదనంగా సంపాదిస్తున్నా.  - రామాచారి, బైక్ రైడర్, టోలిచౌకి

జాబర్స్​నే ఎక్కువగా జాయిన్​..
రైడర్స్​గా చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్​ చూపిస్తుండగా జాబ్​చేస్తున్న వారు పార్ట్​ టైమ్ గా  జాయిన్ అవుతున్నారు. బుకింగ్స్​ కూడా వారి ఆఫీసులకు సమీపంలో వస్తుండడంతో పార్ట్​టైమ్ రైడర్స్​ గా  చేరుతున్నారు. కరోనా తర్వాత రైడర్స్​ఎక్కువయ్యారు. సిటీలో ఎక్కడినుంచైనా క్షణాల్లో బుకింగ్స్​ వస్తుండగా యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్​ చూపుతున్నారు.  
- శివ, ఓలా వెండర్