సెక్రటేరియట్ దగ్గర బైక్ స్టంట్లు, రీల్స్.. యువకుడు అరెస్ట్

సెక్రటేరియట్ దగ్గర బైక్ స్టంట్లు, రీల్స్.. యువకుడు అరెస్ట్

ట్యాంక్​బండ్, వెలుగు: సెక్రటేరియట్‎తో పాటు లుంబిని పార్కు సమీపంలోని ప్రధాన రోడ్లపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీం బేగ్ (23) అనే యువకుడు సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి బాధ్యతారహితంగా విన్యాసాలు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ప్రాణహాని కలిగించేలా డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని, బైక్​తో పాటు వీడియోలు తీసిన ఫోన్​స్వాధీనం చేసుకున్నారు.