వీడియో: ఫ్లైఓవర్ సేఫ్టీ డివైడర్‌ను ఢీకొట్టి బైకర్ మృతి

V6 Velugu Posted on Jul 21, 2021

హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ మీద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడికే మృతిచెందాడు. ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అశోక్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఉండే తన సోదరుడి ఇంటికి వచ్చాడు. తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్స్ తీసుకునేందుకు అశోక్.. బైక్‌పై బయలుదేరాడు. కాగా.. బాలానగర్ ఫ్లైఓవర్ మీదికి చేరుకోగానే.. వేగంగా వెళ్తూ ఫ్లైఓవర్ సేఫ్టీ డివైడర్‌ను ఢీకొట్టాడు. గమనించిన వాహనదారులు వెంటనే 108లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అశోక్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటన మొత్తం ఫ్లైఓవర్ మీద ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయింది.

 

Tagged Hyderabad, accident, Balanagar Flyover, biker death, balanagar flyover accident

Latest Videos

Subscribe Now

More News