గెలవడం కంటే పోరాడటం గొప్ప

గెలవడం కంటే పోరాడటం గొప్ప

శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బైకర్’. మాళవిక నాయర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌. రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ చేసిన శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ‘ఇక్కడ ప్రతి బైకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకి ఎదురెళ్ళే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ళ కథ’  అనే వాయిస్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ‘గెలవడం గొప్పకాదు. చివరిదాక పోరాడటమే  గొప్ప’ అనే డైలాగ్  సినిమాపై ఆసక్తిని పెంచింది.  

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో శర్వానంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చేయడం అంత ఈజీ కాదు. చాలా పెద్ద ఛాలెంజ్. ఇందులో కనిపించినది ఏదీ  సీజీ షాట్ కాదు. ఒరిజినల్ బైకర్స్‌‌‌‌‌‌‌‌తో తీసిన ఒరిజినల్ స్టంట్స్. ఇండోనేషియా వెళ్లి అక్కడ  బైకర్స్‌‌‌‌‌‌‌‌తో  షూట్ చేశాం. ఈ సినిమా నా  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  టర్నింగ్ పాయింట్.  ఇందులో  రాజశేఖర్ గారితో  పనిచేయడం  గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పాడు. 

ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశానని రాజశేఖర్ అన్నారు. రేసింగ్ సినిమాలు చూసి ఆడియెన్స్  ఎంత ఎక్సయిట్  అయ్యారో  వాటికి  మించినట్లుగా ఇది ఉంటుంది అని దర్శకుడు  అభిలాష్ రెడ్డి చెప్పాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.  నిర్మాత వంశీ,  యాక్టర్ నిరూప్,   డిఓపి యువరాజ్ పాల్గొన్నారు.