రోడ్డుపై ఆయిల్‌, మురుగునీరు.. జారిపడి 10 మందికి గాయాలు

రోడ్డుపై ఆయిల్‌, మురుగునీరు.. జారిపడి 10 మందికి గాయాలు
  •  మలక్‌పేట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్‌

హైదరాబాద్‌, వెలుగు: ఆయిల్‌తో కూడిన మురుగు నీరు రోడ్డుపై పారడంతో మలక్​ పేట నల్గొండ క్రాస్​ రోడ్స్ లో బైక్స్ స్కిడ్ అయి సోమవారం ఉదయం 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.  దీంతో ట్రాఫిక్​ పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు.  పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. చంచల్‌గూడ జైలు నుంచి నల్గొండ క్రాస్‌ రోడ్స్‌ రూట్‌లో  సోహెల్ హోటల్ ముందు  డ్రైనేజీ  లీక్‌ అయ్యింది. ఆయిల్‌తో కలిసిన వాటర్‌‌  రోడ్డుపై వచ్చి పారింది. దీంతో చాదర్‌‌ఘట్‌ వైపు వెళ్లే వాహనదారులు జారి కిందపడ్డారు. మలక్‌పేట్ ఫ్లై ఓవర్ మీదుగా వాహనాలను డైవర్ట్ చేశారు.   సైదాబాద్‌, చాదర్‌‌ఘట్‌, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి కోఠికి వెళ్లే రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.