బిల్ గేట్స్.. సాఫ్ట్ వేర్ కిచిడీ.. స్మృతి ఇరానీ వంట పాఠాలు

బిల్ గేట్స్.. సాఫ్ట్ వేర్ కిచిడీ.. స్మృతి ఇరానీ వంట పాఠాలు

కేంద్ర మంత్రి అయినా సహజంగా మహిళ కాబట్టి వంటలు, వార్పులపై మంచి అవగాహన ఉండటం సహజం.. అందులోనూ పాపులర్ నటి.. అంతకు మించి పొలిటీషియన్ అయిన స్మృతి ఇరానీ.. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కు కిచిడీ వంటకం గురించి.. వంట పాఠాలు చెప్పారు. ఇండియా పర్యటనలో భాగంగా బిల్ గేట్స్.. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో దేశంలోని అనేక వంటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రి స్మృతి ఇరానీ.. కిచిడీలో ఉంటే పోషక విలువల గురించి వివరించారు. 

ఈ సందర్భంగా ఎలా చేస్తారంటూ బిల్ గేట్స్ ఆసక్తిగా ప్రశ్నించగా.. ఇలా చేస్తారంటూ పక్కనే ఉన్న రైస్, ఆయిల్, కడాయి.. ఇతర పప్పు, మసాలా దినుసులను బిల్ గేట్స్ చేతులతో వేయిస్తూ.. చూపించారు. కిచిడీకి పోపు ఎలా పెట్టాలో స్వయంగా ఆయన చేతులతోనే చేయిస్తూ.. నేర్పించారు స్మృతి ఇరానీ. దీంతో బిల్ గేట్స్ స్వయంగా దినుసులు వేసి గరిటెతో తిప్పారు. అంతా పూర్తయ్యాక.. దాన్ని ఓ బౌల్ లో తీసుకుని రుచి చూసి.. వాహ్ వా అన్నారు బిల్ గేట్స్.. 

ఈ వీడియోను స్వయంగా పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి.. సాఫ్ట్ వేర్ బాస్ కు కిచిడీ రుచి చూపించారు.. ఇక నుంచి ఇది సాఫ్ట్ వేర్ కిచిడీ అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇదే సమయంలో కిచిడీ చేయటానికి గ్యాస్ ధర బాగా పెరిగిందంటూ ప్రతిపక్షాల నుంచి కౌంటర్లు కూడా బాగానే పడుతున్నాయి...