ప్లేఆఫ్స్ బెర్తుపై గురి.. ఇవాళ్టి(ఏప్రిల్ 7) నుంచి ఢిల్లీలో బిల్లీ జీన్ కింగ్ కప్ టెన్నిస్ టోర్నీ

ప్లేఆఫ్స్ బెర్తుపై గురి.. ఇవాళ్టి(ఏప్రిల్ 7) నుంచి ఢిల్లీలో  బిల్లీ జీన్ కింగ్ కప్ టెన్నిస్ టోర్నీ

న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా-–ఓషియానియా గ్రూప్-1 టెన్నిస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియా టీమ్ రెడీ అయింది. సొంతగడ్డపై మంగళవారం ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సత్తా చాటి  ప్లే-ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే టోర్నీ మొదలవ్వకముందే ఆతిథ్య జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్  భమిడిపాటి శ్రీవల్లి వెన్నునొప్పి కారణంగా వైదొలగగా, ఆమె స్థానంలో రావాల్సిన వైదేహి చౌదరి కూడా గాయపడటంతో చివరి నిమిషంలో జీల్ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు .

ఇండియా ఉన్న గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండోనేసియా, కొరియా, మంగోలియా, న్యూజిలాండ్, థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ జట్లు తలపడనున్నాయి. సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా నంబర్ 1, 2 ప్లేయర్లు  వైష్ణవి అడ్కర్, యమలపల్లి సహజపైనే భారీగా ఆశలు పెట్టుకోగా, డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీనియర్లు అంకిత రైనా, రుతుజా భోసలే కీలకం కానున్నారు.   తొలి రోజు థాయ్‌లాండ్‌తో ఇండియా పోటీ పడనుంది. మెగా టోర్నీలో పోటీ పడుతున్న ఆరు జట్లలో టాప్–-2లో నిలిచిన టీమ్స్‌ ప్లే-ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తాయి.  చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు గ్రూప్–-2కు పడిపోతాయి.