హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 21వ అంతస్తుపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మణికొండ ల్యాంకో హిల్స్ లో ఆగస్టు 11 శుక్రవారం అర్థరాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బిందు శ్రీ అనే యువతి 21వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన బిందుశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. ల్యాంకో హిల్స్ 15 LH బ్లాక్ లోని పూర్ణ చందర్ రావు ఇంట్లో బిందుశ్రీ చిల్డ్రన్ కేర్ టేకర్ గా పనిచేస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదుగాని ఆమె హత్మహత్యకు పాల్పడింది. బిందుశ్రీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.