మరో అయిదు రోజులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ మూత

మరో అయిదు రోజులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ మూత

హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను అవసరమైతే మరో ఐదు రోజులు మూసివేస్తామని తెలిపారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన 20 రోజుల్లోనే రెండు ప్రమాదాలు జరిగాయి.ఈ ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ముగ్గురు నిపుణులతో లీ అసోసియేట్స్ కమిటీని నియమించిందని చెప్పారు. ఫ్లైఓవర్ డిజైన్‌పై ఈ కమిటీ 3 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నదని చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత ఈ వంతెనపై రాకపోకల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రామ్మోహన్.

ఇవాళ(సోమవారం) GHMC ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్.. మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నగరంలోని ఫ్లైఓవర్ల పరిస్థితిపై చర్చించారు.