గుట్టలు గుట్టలుగా పెరుగుతున్నబయో మెడికల్‌‌ వేస్ట్‌‌

గుట్టలు గుట్టలుగా పెరుగుతున్నబయో మెడికల్‌‌ వేస్ట్‌‌
  • 2017లో రోజుకు15 వేల కిలోలు.. 2019లో 20 వేల కిలోలకు పైనే
  • రాష్ట్ర పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు రిపోర్టులో వెల్లడి
  • బయో మెడికల్‌‌ వేస్టేజీ రూల్స్‌‌ పట్టించుకోని హాస్పిటళ్లు
  • మున్సిపల్‌‌ చెత్తలోనే కలిసి పోతున్న 20% మెడికల్‌‌ వేస్ట్‌‌!

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో బయో మెడికల్ వేస్ట్‌‌ రోజురోజుకూ పెరుగుతోంది. రెండేళ్లలోనే రోజుకు 5 వేల కేజీల చొప్పున పెరిగింది. 2017లో రోజుకు15,719 కిలోల(15.71 టన్నులు) వేస్ట్‌‌ ఉత్పత్తి అయితే 2019లో 20,472 కిలోలకు(20.47 టన్నులు) పెరిగింది. ఈ వివరాలన్నీ రాష్ట్ర పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు (పీసీబీ) రిపోర్టు విడుదల చేసింది. ఓవైపు వేస్టేజీ పెరుగుతుంటే మరోవైపు చాలా హాస్పిటళ్లు వేస్ట్‌‌ ప్రాసెసింగ్‌‌లో రూల్స్‌‌ పాటించట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్లైంట్‌‌ ఇస్తే గానీ పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు పట్టించుకోవట్లేదని విమర్శలున్నాయి.

మూడు జిల్లాల నుంచి ఎక్కువ

రాష్ర్టంలో 6,542 హెల్త్​కేర్​ఫెసిలిటీస్​ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజ్‌‌గిరి జిల్లాల్లో హాస్పిటల్స్‌‌ ఎక్కువున్నాయి. ఈ మూడు జిల్లాల నుంచి మెడికల్ వేస్ట్‌‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. రూల్స్‌‌ ప్రకారం మెడికల్‌‌ వేస్ట్‌‌ను రెడ్‌‌, యెల్లో, వైట్‌‌, బ్లూ కేటగిరీలుగా విభజించారు. రెడ్ కేటగిరీలో సూది లేని సిరంజీలు, గ్లౌజులు, బాటిల్స్, ఇంట్రావెనస్ ట్యూబ్‌‌లు, యూరిన్​బ్యాగులు ఉంటాయి. 2017లో ఇలాంటి వేస్ట్‌‌ రోజుకు 3,688 కేజీలు రాగా.. 2019లో 5,085 కేజీలకు పెరిగింది. యెల్లో కేటగిరీలో ఇన్‌‌ఫెక్షన్ ఉన్న అవయవాలు, బొడ్డు పేగులు, రక్తంతో తడిసిన వస్తువులు, బ్యాండేజీలు, కాటన్ ఉంటాయి. ఈ రకం వేస్ట్‌‌ 2019లో రోజుకు 12,016 కేజీలు వచ్చింది. వైట్​కేటగిరీలో నీడిల్స్, సిరంజీలు, బ్లేడ్లు, సర్జరీలు చేసేందుకు వాడే పరికరాలుంటాయి. 2019లో ఇవి రోజుకు 2,729 కేజీలు వచ్చాయి. బ్లూ కేటగిరీ వేస్ట్‌‌ రోజుకు 642 కేజీలు జనరేట్ అయినట్లు పీసీబీ రిపోర్ట్ పేర్కొంది. కిందటి ఏడాది కరోనా వల్ల మెడికల్ వేస్ట్‌‌ మరింతగా పెరిగింది.

ఏరోజుకారోజు ట్రీట్‌‌మెంట్‌‌ ప్లాంట్‌‌కు పంపాలె

వేస్టేజీ రూల్స్ ప్రకారం ఏ రోజుకారోజు మెడికల్‌‌ వేస్ట్‌‌ను 4 కేటగిరీలుగా విభజించి ట్రీట్‌‌మెంట్ ప్లాంట్లకు పంపాలి. కానీ వేస్ట్‌‌ నిర్వహణలో కొన్ని హాస్పిటళ్లు రూల్స్‌‌ పాటించట్లేదని, వేస్ట్‌‌ను విభజించకుండానే తరలిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని హాస్పిటళ్లలో ఐదారు రోజులకోసారి వేస్ట్‌‌ను తరలిస్తున్నారని తెలిసింది. వీటిపై కంప్లయింట్ ఇస్తే గానీ పీసీబీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఎంత బయో మెడికల్ వేస్ట్‌‌ వస్తోంది, ఏ ప్లాంట్‌‌కు ఎంత పంపిస్తున్నారో లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు అప్‌‌డేట్​చేయట్లేదు. పైగా మున్సిపల్​చెత్తలోనే 15 % నుంచి 20 % మెడికల్ వేస్టేజ్​ వెళ్తోందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు.

ట్రీట్‌‌మెంట్‌‌ సరిగా లేకుంటే సమస్యే

మెడికల్ వేస్ట్‌‌ను కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్‌‌మెంట్ ఫెసిలిటీ ప్లాంట్లకు తరలిస్తారు. అక్కడ 800 డిగ్రీల వేడిలో వాటిని కాల్చేస్తారు. కొన్నింటిని పూడ్చిపెడతారు. ఇలాంటి మెడిక్లీన్ ప్లాంట్లు రాష్ట్రంలో 11 చోట్ల ఉన్నాయి. హైదరాబాద్​, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో 4 ప్లాంట్లు, ఉమ్మడి జిల్లాల పరిధిలో 7 ఉన్నాయి. మెడికల్​వేస్ట్‌‌​నిర్వహణ సరిగ్గా లేకున్నా, ట్రీట్‌‌మెంట్ ప్లాంట్లలో సరిగా కాల్చకపోయినా ప్రమాదమని ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. ప్లాంట్ల చుట్టుపక్కల ఉండే జనాలు రోగాల బారీన పడుతారంటున్నారు. హాస్పిటల్స్‌‌ నుంచి ఎప్పటికప్పుడు వేస్టేజ్ తరలించకపోయినా వాటి నుంచి వెలువడే బ్యాక్టీరియా, వైరస్‌‌లతో ప్రాణాలకు ముప్పేనని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఆర్టీసీని సర్కార్‌‌లో విలీనం చేయాలె

లైన్ దాటి మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్త.. వినకపోతే కాళ్లు పట్టుకొని బండకు కొడతా

కేసీఆర్​ వార్నింగ్​ వెనుక మతలబేంది..? ఆరా తీస్తున్న కేడర్

వైరల్ వీడియో: మహిళా జడ్జితో నిందితుడి పరాచకాలు