
- మున్సిపల్ఆఫీసులలో సీసీ కెమెరాలు
- చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఆటోలకు జీపీఎస్
- కలెక్టర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ
నిర్మల్,వెలుగు: పారిశుద్ధ్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించేందుకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ చర్యలు ప్రారంభించారు. శుక్రవారం ఆయా మున్సిపాలిటీల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పనిచేసే శానిటేషన్సిబ్బందికి రోజూ రెండుసార్లు బయోమెట్రిక్ హాజరు ఉండాలన్నారు. మూడు మున్సిపల్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కలెక్టరేట్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. చెత్త సేకరణ కోసం తిరిగే ట్రాక్టర్లు, ఆటో రిక్షాలకు జీపీఎస్బిగించాలన్నారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్యంపై ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించాలని, రోడ్లపై మట్టి లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు పట్టణంలోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మీటింగ్ లో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్కమిషనర్లు సంపత్, రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
బీసీ జనగణన చేయాలి
మంచిర్యాల/ఆసిఫాబాద్/మందమర్రి,వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం విద్యార్థులు, యువజనుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థి, యువజన పోరుయాత్ర శుక్రవారం ఆసిఫాబాద్,మంచిర్యాల జిల్లాల్లో కొనసాగింది. మంచిర్యాలలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్రావు, ఆసిఫాబాద్, మందమర్రిలో వివిధ కులసంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులు స్వాగతం పలికారు. మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీగా చేరుకుని మహాత్మా జ్యోతిరావు పూలే ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జాతీయ స్థాయిలో బీసీ జనగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు రెండేండ్లుగా చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే దుస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలో దొరల పాలనను పాతరేసి గోల్కొండ ఖిలాపై సామాజిక, బహుజన జెండా ఎగురవేస్తామన్నారు. బంగారు తెలంగాణలో స్కూల్స్, కాలేజ్, వర్సీటీలు వస్తాయనుకుంటే సీఎం కేసీఆర్గల్లీకో బెల్ట్ షాపు పెట్టించి తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండని మండిపడ్డారు. మంచిర్యాలలో వివిధ సంఘాల నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, రాంశెట్టి నరేందర్ నాయుడు, పూదరి చంద్రమోహన్‌గౌడ్, విక్రం గౌడ్, కనకాల శ్యామ్ కుర్మ, గొల్ల రాజన్న యాదవ్ పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్, ప్రధాన కార్యదర్శి గాజుల జక్కయ్య, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య, ఎమ్మార్పీఎస్జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర ఆత్మరామ్ నాయక్, అంబేద్కర్ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు జాడి బాపు, మాలీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేసే శంకర్, మందమర్రిలో బీసీ సంక్షేమ సంఘం లీడర్లు శ్రీనివాస్, శ్రీకుల్కచెర్ల శ్రీనివాస్, కనకాల శ్యామ్ కుర్మ, మణిమంజరి తదితరులు పాల్గొన్నారు
జిల్లా స్థాయి ఖేల్ కూద్ పోటీలు
భైంసా,వెలుగు: భైంసా కిసాన్‌గల్లీ సరస్వతీ శిశుమందిర్‌లో శుక్రవారం జిల్లాస్థాయి ఖేల్ కూద్పోటీలు నిర్వహించారు. పోటీల్లో 350 మంది స్టూడెంట్స్పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభాగ్ కార్యదర్శి కట్టనాగచారి మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జ్ఙాపకశక్తికి ఉపయోగపడుతాయన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విభాగ్సహ కార్యదర్శి కుంట కాశీనాథ్, ప్రబంధకారిణి సభ్యులు పెండెపు కాశీనాథ్, డాక్టర్సంతోష్, ఎనుపోతుల మల్లేశ్, తూం దత్తు, హెచ్ఎం నామాల భోజన్న తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు షురూ
మంచిర్యాల, వెలుగు: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం సాయంత్రం స్థానిక జడ్పీ హైస్కూల్ గ్రౌడ్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీసీపీ అఖిల్ మహాజన్, సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ కలిసి పోటీలను ప్రారంభించారు. అంతకుముందు బెల్లంపల్లి చౌరస్తా నుంచి గుస్సాడీ నృత్యాలతో క్రీడాకారులకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు1200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 68 జట్లతో నాలుగు రోజులపాటు పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభచాటి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఓడినవారు నిరాశ చెందకుండా గెలుపు కోసం కృషి చేయాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయని డీసీపీ చెప్పారు. విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ క్రీడలను అలవర్చుకోవాలని సింగరేణి డైరెక్టర్ సూచించారు. ముఖ్య అతిథులు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. నల్గొండ, అదిలాబాద్ జట్ల క్రీడాకారులతో మొదటి రోజు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్షిప్ డబ్బులు రిలీజ్ చేయాలి
బెల్లంపల్లి,వెలుగు: రాష్ట్రంలో పెఇండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్సర్కార్విఫలమైందన్నారు. అనంతరం ఆర్డీవో శ్యామలాదేవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జగజంపుల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధార్త్, జిల్లా నాయకులు వినోద్, తిరుపతి, డివిజన్ నాయకులు చేతన్, సంతోష్, రమ్య, సంగీత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
వడ్ల బస్తా 41 కిలోలు తూకం వేయాలి
మంచిర్యాల, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలను 41 కిలోలు మాత్రమే తూకం వేయాలని, అంతకంటే ఎక్కువ చేస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల సెంటర్‌ను సందర్శించారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు. అనంతరం యోగేశ్వర రైస్ మిల్లును సందర్శించారు. ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని సాధించాలి.... విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంచిర్యాల హైటెక్‌సిటీ కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల గర్ల్స్ స్కూల్‌ను తనిఖీ చేశారు.
మొక్రా(కె)ను అభినందించిన స్వచ్ఛ భారత్ మిషన్
ఇచ్చోడ, వెలుగు: ఇచ్చోడ మండలంలోని మొక్రా(కె) గ్రామం వందశాతం ఓడీఎఫ్ ఫ్లస్ విలేజ్‌గా నిలిచిందని, సర్పంచ్ గాడ్గె మీనాక్షి సేవలు అభినందనీయమని స్వచ్ఛ భారత్మిషన్బాధ్యులు అభినందించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశంలోని గ్రామీణ పల్లెల అభివృద్ధిలో మొక్రా(కె) మోడల్ విలేజీగా నిలుస్తుందన్నారు.