బర్డ్ ఫ్లూ కలకలం..చికిన్ తినొద్దన్న అధికారులు

బర్డ్ ఫ్లూ కలకలం..చికిన్ తినొద్దన్న అధికారులు

జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. బొకారో జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తయింది. లోహాంచల్ లోని ప్రసిద్ధ  కడక్ నాథ్  కోళ్ల మాంసంలో H5N1 వేరియంట్ ఉన్నట్లు నిర్థారించారు.  అధిక ప్రోటీన్ ఉన్న కడక్ నాథ్ కోళ్లలో ఈ వ్యాధిని గుర్తించారు.

లోహంచల్‌లోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా కడక్‌నాథ్ కోళ్లు చనివడంతో ఒక కిలో మీటర్ పరిధిలోని ప్రాంతాలను ప్రభావిత జోన్ గా ప్రకటించారు.  10 కిమీ పరిధిలోని ప్రాంతాల్లో నిఘా పెంచారు.  ఈ ప్రాంతాల్లో చికెన్ , బాతు అమ్మకాలు నిషేధిస్తున్నామని  బొకారో జిల్లా అధికారులు ప్రకటించారు. 

బర్డ్ ఫ్లూ విషయంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి అరుణ్ కుమార్ వెల్లడించారు. దీంతో పాటు  వ్యాధి సోకిన జోన్‌లో నివసిస్తున్న వ్యక్తుల నమూనాలను సేకరించాలని వైద్య బృందాన్ని కోరారు. అయితే బర్డ్ ఫ్లూ లక్షణాలున్న  వారికి చికిత్స కోసం సదర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు చికెన్, బాతు మాంసం  తినడం మానుకోవాలని ప్రజలకు సూచించారు.  

బర్డ్ ఫ్లూ సోకితే  తీవ్రమైన వెన్నునొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, జలుబు, కఫంలో రక్తం వంటి లక్షణాలు ఉంటాయి.