
న్యూఢిల్లీ: మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా రకం 'ఏ' వైరస్‌ల వల్ల కలిగే వ్యాధి. దేశీయ పౌల్ట్రీ, ఇతర పక్షులు, పాలిచ్చే జంతువులకు సోకుతుంది. అయితే ఈ జబ్బు ప్రస్తుతం మనుషులకూ సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో తాజా విశ్లేషణ చెబుతోంది. 25 ఏండ్లుగా అడవుల్లోని పక్షులు, కోళ్లల్లో ఉన్న హెచ్5ఎన్1 వైరస్ ప్రస్తుతం.. మానవులను కూడా ప్రభావితంచేసే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. అందువల్ల మనుషులు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న అడవి జంతువులను తాకవద్దని సూచించారు.