
హైదరాబాద్: ఈ సీజన్ హెడ్ టు హెడ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ సమంగా నిలిచాయి. ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్తాన్ గెలిస్తే.. గత పోరులో నెగ్గిన హైదరాబాద్ ఓ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుంది. గ్రౌండ్‌లోనే కాకుండా సోషల్ మీడియా వేదిగా జరిగిన ఫన్ వార్‌లోనూ రాయల్స్‌కు దీటుగా బదులిచ్చింది. బిర్యానీ సెంటర్‌గా రెండు జట్ల మధ్య ట్విట్టర్‌లో సరదా సంభాషణ నడిచింది. ఈనెల 11న హైదరాబాద్‌ను ఓడించిన తర్వాత రాయల్స్ ‘హే జొమాటో మాకో పెద్ద హైదరాబాదీ బిర్యానీ కావాలి. లొకేషన్.. వన్ అండ్ ఓన్లీ రాయల్ మిరేజ్ (టీమ్ స్టే చేస్తున్న రిసార్ట్)’ అని ట్వీట్ చేసింది. హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ కావడం, పైగా ఆ రోజు ‘వరల్డ్ బిర్యానీ డే’ కావడంతో రాయల్స్ ట్వీట్ అందరిని ఆకర్షించింది. ఈ పోస్టును మైండ్‌లో ఉంచుకున్న సన్‌రైజర్స్.. గురువారం విక్టరీ తర్వాత ‘బిర్యానీ ఆర్డర్ క్యాన్సెల్ చేయండి. మా ఫ్రెండ్స్ అంత ఘాటును తట్టుకోలేరు. వాళ్లకు దాల్ బాటి (రాజస్తాన్ వంటకం) సరిపోతుంది’ అంటూ ట్వీట్ పెట్టి రాయల్స్‌కు కౌంటర్ ఇచ్చింది.