మన బిర్యానీకి ప్రపంచమంతా ఫిదా: టాప్-10 ఫుడ్స్ ఇవే

మన బిర్యానీకి ప్రపంచమంతా ఫిదా: టాప్-10 ఫుడ్స్ ఇవే

చికెన్ బిర్యానీకి ఫుడ్ ఐటమ్స్ లో ఎప్పుడూ టాప్ ప్లేసే. ఇది ఒక్క హైదరాబాద్ లేదా ఇండియాకే పరిమితం కాదు. ప్రపంచమంతా మన బిర్యానీకి ఫిదా అయిపోయింది. 2019 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్ లో టాప్ – 10 ఐటమ్స్ లో దీనికే తొలిస్థానం దక్కింది. సగటున నెలకి 4.56 లక్షల మంది బిర్యానీ కోసం సెర్చ్ చేసినట్లు ఇండియన్ ఫుడ్స్ పై అమెరికాకు చెందిన సెమ్ రష్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది. టాప్ – 10 ఫుడ్ సెర్స్ లో ఎక్కువగా చికెన్ ఐటమ్సే ఉన్నాయి. పంజాబీ ఫేవరేట్ ఫుడ్ అయిన బటర్ చికెన్ ని కూడా ప్రపంచ వ్యాప్తంగా జనాలు బాగా లైక్ చేస్తున్నారు. టిఫిన్స్ లో సౌతిండియా ఐటమ్ దోసె రేసులో ముందు వరుసలో నిలిచింది. తొలి ఐదు స్థానాల్లో చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోసె, తందూరీ చికెన్ నిలిచాయి. తర్వాతి ఐదు స్థానాల్లో పాలక్ పనీర్, నాన్, దాల్ మఖనీ, చాట్ ఉన్నాయి.

ప్రపంచమంతా ఇండియన్స్ ఉండడం వల్లే

ఈ సర్వే ఫలితాలను చూసి తాము ఏం పెద్దగా ఆశ్చర్యపోలేదని సెమ్ రష్ కమ్యూనికేషన్స్ హెడ్ ఫెర్నాండో అంగులో చెప్పారు. భారతీయులు ప్రపంచమంతా సెటిల్ అయ్యి ఉన్నారని, అందువల్లే ఇండియన్ ఫుడ్స్ టాప్ లో ఉన్నాయని అన్నారు. ఫుడ్ బిజినెస్ లో అడుగు పెట్టాలనుకునే వారికి ఈ సర్వే ఓ గైడ్ లా ఉపయోగపడుతుందని, ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్లకు మంచిన ఆప్షన్ లేదని అన్నారు.

ఫుడ్ ఐటమ్                        సగటున నెలలో సెర్స్

చికెన్ బిర్యానీ                                 4.56 లక్షలు

బటర్ చికెన్                                      4 లక్షలు

సమోసా                                            3.9 లక్షలు

చికెన్ టిక్కా మసాలా                      2.5 లక్షలు

దోసె                                               2.28 లక్షలు