బిట్స్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో..ట్యూటెం ప్రాజెక్టు వర్క్‌‌‌‌‌‌‌‌షాప్

బిట్స్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో..ట్యూటెం ప్రాజెక్టు వర్క్‌‌‌‌‌‌‌‌షాప్

హైదరాబాద్, వెలుగు : శామీర్​పేటలోని బిట్స్  క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో సోమవారం ట్యూటెం (టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ టు ఎన్‌‌‌‌‌‌‌‌హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసెబిలిటీ) ప్రాజెక్టు మొదటి వర్క్‌‌‌‌‌‌‌‌షాప్ జరిగింది. చీఫ్ గెస్టులుగా డీజీపీ అంజనీకుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ ​రెడ్డి పాల్గొన్నారు.  ప్రొఫెసర్ ప్రశాంత సాహూ  సమన్వయంతో బిట్స్ హైదరాబాద్, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ టెక్నికల్ టీమ్ మెట్రో రైల్, ఇతర ప్రజారవాణా, ప్రయాణికుల  భద్రతను మెరుగుపరచడానికి 

సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి రెండేళ్లుగా కృషి చేస్తుంది.   ప్రపంచవ్యాప్తంగా జరిగిన  పోటీల్లో టీమ్ పాల్గొని ఆసియా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ 3.99 లక్షల డాలర్ల (రూ.3.32 కోట్లు) గ్రాంట్‌‌‌‌‌‌‌‌ను కూడా గెలుచుకుంది. అనంతరం వక్తలు మాట్లాడారు. వర్క్ షాప్​లో  బిట్స్ హైదరాబాద్ డైరెక్టర్  ప్రొఫెసర్ జి.సుందర్, ఐఐటీ బాంబే ప్రొఫెసర్ అవిజిత్, విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శిఖా గోయల్ పాల్గొన్నారు.