Papa Buka: చరిత్ర సృష్టించిన డైరెక్టర్ పా.రంజిత్‌ మూవీ.. ఆ దేశం నుంచి తొలిసారి ఆస్కార్ బరిలో

 Papa Buka: చరిత్ర సృష్టించిన డైరెక్టర్ పా.రంజిత్‌ మూవీ.. ఆ దేశం నుంచి తొలిసారి ఆస్కార్ బరిలో

మలయాళ డైరెక్టర్ డా,,బిజు కుమార్‌ తెరకెక్కించిన ‘పాపా బుకా’ మూవీ అరుదైన గౌరవం దక్కించుకుంది. తంగలన్ డైరెక్టర్ పా.రంజిత్‌. సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ 98వ ఆస్కార్‌ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్‌ను పొందింది.

అంతేకాకుండా పాపువా న్యూ గినీ (PNG) దేశం నుంచి అకాడమీ పురస్కారాల్లో అర్హత సాధించిన ఫస్ట్ మూవీగా రికార్డు సృష్టించింది. ఆ దేశం స్వాతంత్ర్యం పొంది 50వ సంవత్సరం పూర్తిచేసుకోవడం, ఇదే సమయంలో ‘పాపా బుకా’ఆస్కార్‌కి ఎంపిక అవ్వడం ప్రత్యేకథను చాటుకుంది. ‘పాపువా న్యూ గినియా’అనేది నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది 1975లో ఆస్ట్రేలియా నుండి స్వాతంత్ర్యం పొందింది. 

పాపువా న్యూ గినియా మూవీ నిర్మాత నోయెలీన్ తౌలా వునుమ్తో పాటు భారతీయ నిర్మాతలు  పా రంజిత్, అక్షయ్ కుమార్ పరిజా (ఒడియా) మరియు ప్రకాష్ బేర్‌లతో కలిసి నిర్మించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పా రంజిత్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. 

‘‘అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు పాపా బుకా అధికారికంగా నామినేషన్‌ను పొందింది. పాపా న్యూ గినియా దేశం నుంచి ఎంట్రీగా ఎంపికైందని చెప్పడం నాకెంతో గర్వకారణం. మా నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్‌కు ఇవి గర్వించదగ్గ క్షణాలు. భారతదేశం నుంచి నిర్మాతలలో ఒకరిగా.. రెండు దేశాల సహ నిర్మాణంలో భాగం కావడం మా నిర్మాణ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మన కథలు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ కథను ప్రపంచ వేదికకు తీసుకెళ్లడంలో గౌరవంగా భావిస్తున్నానని’’పా రంజిత్ పోస్ట్‌లో వెల్లడించారు.

పాపా బుకా మూవీ:

రెండో ప్రపంచ యుద్ధంలో.. PNGలో పోరాడిన భారతీయ సైనికుల గురించి చాటి చెప్పే చిత్రమిది. వారి వీరోచిత పోరాటం, దేశం కోసం ప్రాణ త్యాగం, చివరికి వారి ఆనవాళ్లు కూడా లేని కన్నీటి గాథ ఇది. ఈ మూవీ సెప్టెంబరు 19న విడుదల కానుంది.

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2016లో బోమనా యుద్ధ స్మశానవాటికను సందర్శించడం ద్వారా ప్రేరణ పొందింది. ఇది ఎంతో మంది గుర్తుతెలియని భారత సైనికుల అంతిమ విశ్రాంతి స్థలంగా చెప్పబడుతుంది. అంటే, ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కోసం ఏర్పాటు చేయబడ్డ స్మశానవాటిక ఇది.

ఇక్కడ 3,824 కంటే ఎక్కువ మంది కామన్వెల్త్ సైనికులు ఖననం చేయబడ్డారు. వీరిలో 699 మందిని గుర్తించలేకపోయారు. ఈ స్మశానవాటికకు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సందర్శించి నివాళులు అర్పించారు.