
మహాబూబాద్ జిల్లాలో నలుగురు మైనర్లు రెచ్చిపోయారు. మహబూబాబాద్ పట్టణంలోని బాల సదనంలో నైట్ వాచ్ మెన్ పై దాడి చేసి రూంలో బందించి పరారయ్యారు నలుగురు మైనర్ బాలికలు. శుక్రవారం ( ఆగస్టు 29 ) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వైవరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ పట్టణంలోని బాల సదనం ప్రభుత్వ బాలికల హాస్టల్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. నలుగురు మైనర్ బాలికలు హాస్టల్ నైట్ వాచ్ మెన్ ను కొట్టి రూంలో బంధించి మొబైల్ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.
ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సూపరిండెంట్ ధనలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, బాలికలు ఎత్తుకెళ్లిన సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు పరారైన నలుగురు బాలికల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు బాలికల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
బాలికలు పారిపోవడానికి హాస్టల్ సిబ్బంది ప్రవర్తన కారణమా..? లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చక్కగా చదువుకొవల్సిన బాలికల్లో ఇలా విపరీత ధోరణి పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.