రామచంద్రాపురం, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం భారతీనగర్, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో రూ. 5 కోట్ల 65 లక్షల నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హెచ్ఐజీ మాధవ నగర్లో, మ్యాక్సొసైటీ, మల్లికార్జున నగర్ కాలనీ, మయూరి నగర్, ఆర్సీరెడ్డి నగర్ తదితర కాలనీల్లో కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్‌రెడ్డి, పుష్ప నగేశ్‌తో కలిసి పనులను ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో డివిజన్ల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. స్థానిక ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
సీనియర్ సిటిజన్లకు భవనాలు, పార్కులు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సీసీ రోడ్లు, యూజీడీ, తాగునీటి పైప్లైన్లు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఈ వెంకటరమణ, అంజయ్య, పరమేశ్‌యాదవ్, ఐలేశ్, ప్రమోద్‌గౌడ్, శ్రీనివాస్, సలీం, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, బీఎన్‌రెడ్డి, పాపయ్య పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
అమీన్పూర్(పటాన్చెరు): నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని వావిలాల గ్రామానికి చెందిన ఆరేళ్ల శంకర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఎమ్మెల్యే ద్వారా ఎల్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన లక్ష ఎల్ఓసీని మంగళవారం సాయంత్రం పటాన్‌చెరులోని క్యాంపు ఆఫీసులో శంకర్ కుటుంబీకులకు అందజేశారు.
