కరీంనగర్ లో వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం..పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు

కరీంనగర్ లో  వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం..పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో మంగళవారం స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు తీసుకవచ్చి సమర్పించారు.  అనంతరం మంత్రి పొన్నం, సుడా చైర్మన్  కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి దంపతులు పూలదండలు వేంకటేశ్వర స్వామికి సమర్పించారు. స్వామివారి కల్యాణానికి వేలాది భక్తులు తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో లోక్ నాథ్ , ఆర్డీవో మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.