
ఆగస్టు ( 2025) నెల చివరికొచ్చింది. మరో రెండు రోజుల్లో ( ఆగస్టు 29 నాటికి) సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నెలలోనే బాధ్రపదమాసం ముగిసి.. ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో అనేక పండుగలతో పాటు సెలవులు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ లో ఓనం పండుగ.. వినాయక నిమజ్జనం.. పితృపక్షం.. చంద్రగ్రహణం సూర్యగ్రహణం.. సూర్యగ్రహణం.. బతుకమ్మ పండుగ రాబోతున్నాయి. ఏ పండుగ ఏ తేది వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
- సెప్టెంబర్ 2 : రామ్ దేవ్జయంతి.... ఈపండుగను రాజస్థాన్ లో జరుపుకుంటారు. ఆ రోజున రాజస్థాన్ లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంట్లో ప్రత్యేక భోజనం తయారు చేసి ఆయనకు నైవేద్యం పెడతారు. ఈ రోజున భక్తులు ఆలయంలో బొమ్మ చెక్క గుర్రాలకు కొత్త బట్టలు ఇస్తారు. ఆయన సమాధి స్థల్ సమీపంలో ఒక మెగా ఫెస్ట్ నిర్వహిస్తారు.
- సెప్టెంబర్ 3: ఏకాదశి.. ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తారు... ఉపవాసం ఉంటారు.
- సెప్టెంబర్ 4 : ఓనమ్.. కేరళ వాసులు ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను జీవితంలో ఆనందం, శ్రేయస్సుకి, సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు.
- సెప్టెంబర్ 4 : ఈద్ మిలాద్ ఉన్ నబి: ఇస్లాం మతంలో ఎంతో విశిష్టత కలిగిన ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగ ఈ ఏడాది సెప్టెంబర్ 4న జరుపుకోనున్నారు. ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ పుట్టిన రోజునే ఈ ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగను మవ్లీద్ అని కూడా పిలుస్తారు.
- సెప్టెంబర్ 5: ఉపాధ్యాయుల దినోత్సవం.. పాఠశాలలను సుందరంగా అలంకరించి.. విద్యార్థులే టీచర్లుగా మారి పాఠాలు చెబుతుతారు.
- సెప్టెంబర్ 6 : గణేష్ నిమజ్జనం.. అనంత చతుర్ధశి .. ఈ రోజున శ్రీమమావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రక్షా సూత్రం కూడా కడతారు. ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
- సెప్టెంబర్ 7: చంద్ర గ్రహణం
- సెప్టెంబర్ 8 : పితృపక్షం ప్రారంభం.. బాధ్రపదమాసం కృష్ణ పక్షంలో పితృదేవతలు కాలం చేసిన తిథి రోజున తర్పణాలు వదులుతారు. ఒక వేళ తెలియకపోయినా..ఏదేని కారణం వలన తర్పణాలు వదలకపోయినా.. అమావాస్య రోజున పితృదేవతలందరికి వదులుతారు.
- సెప్టెంబర్ 21.. మహాలయ అమావాస్య.. ఈ రోజున పితృదేవతలందరికి.. గురువుకు. పిండ ప్రదానం చేస్తారు.
- సెప్టెంబర్ 21 : భాద్రపద అమావాస్య రోజు... సూర్యగ్రహణం
- సెప్టెంబర్ 22: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ( బతుకమ్మ పండుగ ప్రారంభం)
- సెప్టెంబర్ 29 : - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవిపూజ
- సెప్టెంబర్ 30 : దుర్గాష్టమి .. శ్రీ దుర్గా దేవి పూజ