
గత కొద్దిరోజుల క్రితం సుప్రీం కోర్ట్ వీధికుక్కలపై కీలక తీర్పు వెల్లడించాక అటు ప్రజల్లో, ఇటు సోషల్ మీడియాలో దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే సమయంలో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో వీధికుక్కలు కరవడంతో కొన్ని నెలలుగా ప్రాణాలతో పోరాడుతున్న నాలుగేళ్ల చిన్నారి ఆదివారం రాత్రి మృతి చెందింది.
వివరాలు చూస్తే బెంగళూరు దావణగెరెకి చెందిన ఖాదీరా బాను అనే 4 ఏళ్ళ చిన్నారి రేబిస్ వ్యాధి బారిన పడి మరణించింది. గత ఏప్రిల్‌లో ఖాదీరా బాను ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. దింతో కుటుంబికులు పాపని మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లరు, అక్కడ చిన్నారి కోలుకుంటుంది అనుకునేలోపే వాంతులు కావడం మొదలయ్యాయి తరువాత రేబిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది.
పాప మామ సాజిద్ మాట్లాడుతూ పాపను కాపాడటానికి ఇప్పటివరకు 9 నుండి 10 లక్షలు ఖర్చు చేశాము. పాపని కాపాడటానికి అన్ని విధాలుగా ప్రయత్నించాము. ఇన్ని రోజులు బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలోనే ఉంది. దావణగెరెలో చాలా వీధి కుక్కలు ఉన్నాయి, ఈ సమస్యను పాటించుకోవడానికి ఎవరూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే విధి కుక్కలు ఆమె ముఖం పై కొరికాయి, డాక్టర్లు ఆమెకు వైద్యం అందించిన ఇన్ఫెక్షన్ వ్యాపించింది. ఇలా ఏ పాపకు జరగకూడదని కోరుకుంటున్నానని అన్నారు.
ALSO READ : లిఫ్ట్ లేని బిల్డింగ్.. నాలుగు ఫ్లోర్లు ఎక్కి చంపేసి వెళ్లిపోవడం అంటే.
ఈ నెల ఆగస్టు 12న బెంగళూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ విద్యార్థులు ఇద్దరు క్యాంపస్‌లో ఉదయం వాకింగ్ కోసం వెళుతుండగా విధి కుక్కలు దాడి చేశాయి. అలాగే గత నెల జూలైలో కోడిగెహల్లిలోని కెంపెగౌడ లేఅవుట్‌లో పొద్దునే 3 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చిన 68 ఏళ్ల సీతప్పపై కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. గత ఏడాది జలహల్లిలోని ఎయిర్ ఫోర్స్ ఈస్ట్ రెసిడెన్షియల్ క్యాంప్ లోపల రిటైర్డ్ స్కూల్ టీచర్ రాజ్‌దులారి సిన్హాను వీధి కుక్కలు దాడి చేయగా, ఆమె మరణించింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం ఈ ఏడాది జూలై 31 వరకు కర్ణాటకలో 2.81 లక్షల కుక్క కాటు కేసులు రికార్డ్ అయ్యాయి, ఇందులో 26 మంది మరణించారు. అయితే విజయపురలో మొత్తం 15,527 కుక్క కాటు కేసులు, తరువాత బెంగళూరు నగరంలో 13,831, హసన్లో 13,388, దక్షిణ కన్నడలో 12,524, బాగల్‌కోట్లో 12,392 కేసులు ఉన్నాయి.