చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం

చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం

రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను అల్లవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, రోడ్లు కూడా బాగోలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుభోదయం కార్యక్రమంలో భాగంగా ప్రజలను పలుకరించి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు అల్లవాడ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్యను అభివృద్ధి పనులపై ప్రజలు నిలదీశారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఎమ్మెల్యే వెంటనే తమ ఊరి నుంచి వెళ్లిపోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గుర్తు లేవా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.