- 9 జిల్లాల నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కీలక భేటీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో బీజేపీని మరింత బలోపేతం చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని తొమ్మిది జిల్లాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్లోని ప్రతి డివిజన్‌లో పార్టీని శక్తిమంతంగా తయారు చేయడం కార్యకర్తలందరి బాధ్యత అన్నారు. సంస్థాగతంగా లోపాలు లేకుండా చూసుకుంటూ, ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, లబ్ధిదారులతో నిరంతరం టచ్‌లో ఉండాలని సూచించారు. సమావేశంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని సమావేశం నిర్ణయించింది.
