
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నా యమని ఆ పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు . ప్రజాదరణ, పోరాటపటిమ కలిగి న నాయకులకు బీజేపీఎప్పుడూ అండగా ఉంటుం దని చెప్పారు . ఒవైసీని పక్కన పెట్టుకుని సీఎం కేసీఆర్ మతతత్వ రాజకీయాలు చేస్తున్నా రని విమర్శించారు. మహబూబ్ నగర్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ సందర్భం గా ఆయన ప్రసంగించారు. కేంద్రంలోమరో మారు బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, 29 న దక్షిణ భారతదేశంలో మహబూబ్ నగర్ నుంచి మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని చెప్పారు . డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పాలమూరుకు న్యా యం జరగాలంటే కేంద్రంలో మోడీ అధికారంలోకి రావాలన్నారు . జైపాల్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసమే తెలంగాణను కోరుకున్నారని అన్నారు .
కేసీఆర్ ఢిల్లీలో ఒకమాట.. ఇక్కడో మాట….
మోడీ పథకాలకు పేర్లు మార్చి తామే చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ విమర్శించారు. ఢిల్లీలో ఒక మాట..హైదరాబాద్ లో మరోమాట మాట్లాడటం కేసీఆర్ కు అలవాటైందన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరును అంతర్జాతీయ సమాజానికి తెలియజేశామన్నారు .