
- యువతి మెడలో చైను లాగి పారిపోయే యత్నం
- వెంటాడి పట్టుకున్న కానిస్టేబుళ్లు
మెహిదీపట్నం, వెలుగు: చైన్ స్నాచర్‌ను కానిస్టేబుళ్లు వెంబడించి పట్టుకున్నారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ కుమార్ వివరాలు వెల్లడించారు. శుక్రవారం కోకాపేట నుంచి మెహిదీపట్నంకు బస్సులో వచ్చిన యువతి మౌనిక రోడ్డు క్రాస్ చేస్తోంది.
రాజేందర్ నగర్ కు చెందిన షేక్ అలీమ్(30) ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకుని పారిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు విక్రమ్, సిద్ధార్థ పరిగెత్తి చైన్ స్నాచర్ ను పట్టుకున్నారు.
15 గ్రాముల చైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి రిమాండ్‌కు పంపారు. చైన్‌స్నాచింగ్ చేశాక ఎలా పారిపోవాలో తెలుసుకునేందుకు నిందితుడు యూట్యూబ్ వీడియోలు కూడా చూసినట్లు తెలిసింది.