ఐఫోన్ కోసం యాపిల్ స్టోర్‌‌‌‌‌‌‌‌లో కొట్టుకున్న యువకులు

ఐఫోన్ కోసం యాపిల్ స్టోర్‌‌‌‌‌‌‌‌లో కొట్టుకున్న యువకులు
  • ఢిల్లీ, బెంగళూరు, పుణెలోని స్టోర్ల వద్ద భారీ లైన్లు
  • యాపిల్‌ స్టోర్ల వద్ద బారులు తీరిన జనం 


న్యూఢిల్లీ: ఐఫోన్‌‌‌‌ 17 కోసం జనం ఎగబడ్డారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మన దేశంలో కొత్త సిరీస్ అమ్మకాలు ప్రారంభం కాగా.. వాటిని కొనుగోలు చేసేందుకు యాపిల్ స్టోర్ల ముందు యువత బారులుతీరారు. కొన్నిచోట్ల గురువారం అర్ధరాత్రి నుంచే క్యూ కట్టారు. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, పుణెలో యాపిల్ స్టోర్లకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ముంబై బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌‌‌‌లోని స్టోర్‌‌‌‌‌‌‌‌లో తోపులాట జరిగింది. అక్కడ కొందరు యువకులు కొట్టుకున్నారు. క్యూ లైన్ క్రాస్ చేసి వెళ్తున్నారని ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి వాళ్లను విడిపించారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘నేను ఉదయం నుంచి లైన్‌‌‌‌లో ఉన్నాను. ఇక్కడ సెక్యూరిటీ సరిగా లేదు. జనం లైన్ బ్రేక్ చేసి వెళ్లిపోతున్నారు” అని మోహన్ యాదవ్ అనే వ్యక్తి తెలిపాడు. ఇక, ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌‌‌‌లోని యాపిల్‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌కు జనం గురువారం అర్ధరాత్రి నుంచే భారీ సంఖ్యలో చేరుకున్నారు. మాల్‌‌‌‌లోని రెండు ఫ్లోర్ల వరకు జనం క్యూ కట్టారు. కొంతమంది పంజాబ్, ఇతర పరిసర ప్రాంతాల నుంచి ఫోన్ కొనేందుకు వచ్చారు. మరోవైపు, బెంగళూర్, పుణెలోని యాపిల్ స్టోర్లకు కూడా ఐఫోన్ లవర్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా, ఐఫోన్ 17 సిరీస్‌‌‌‌లో భాగంగా వివిధ మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది. మన దేశంలో ఐఫోన్ 17 రేటు రూ.82,900 ఉండగా.. ఐఫోన్ 17 ఎయిర్ రూ.1,19,900, ఐఫోన్ 17 ప్రో రూ.1,34,900, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ.1,49,900 ఉంది. ఫోన్లతో పాటు కొత్త వాచ్‌‌‌‌లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌పాడ్స్‌‌‌‌ను కూడా యాపిల్ కంపెనీ రిలీజ్ చేసింది.