
నిజామాబాద్, వెలుగు: నగర శివారులోని గవర్నమెంట్ డైట్ కాలేజీ ఎదుట ఆర్టీసీ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ శుక్రవారం రోడ్డుపై ధర్నాకు దిగారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులో వచ్చే సమయంలో నాగారం బస్టాప్‌లో దింపేయడంతో, కాలేజీకి చేరడానికి ఆలస్యమవుతుందన్నారు.
ఫేసియల్ అటెండెన్స్ ఇవ్వలేకపోతున్నామని, అటెండెన్స్ శాతం తగ్గితే ఫైనల్ ఎగ్జామ్‌కు అనుమతించరని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని డ్రైవర్లకు చెప్పినా పట్టించుకోలేదని, కాలేజీ ఎదుట రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.