కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలి.. కార్పొరేటర్ల వినతి

కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలి..  కార్పొరేటర్ల వినతి

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ, బీఆర్ఎస్​ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్​కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద బీజేపీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహా రెడ్డి మాట్లాడుతూ..

కౌన్సిల్ సమావేశం 3 నెలలకోసారి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ జరగట్లేదన్నారు. మేయర్ సైతం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాను ఆదుకోవాలని కోరారు. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని హైకోర్టుని సైతం ఆశ్రయించామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్, సరూర్​నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఉన్నారు.

కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్​కు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కమిషనర్ వల్లే ఆలస్యం అవుతోందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు.  కౌన్సిల్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున వినతిపత్రం ఇచ్చామన్నారు. ఒకే అంశం కావడం వల్లే బీజేపీతో కలిసి మాట్లాడామన్నారు.