ఉట్నూర్ లో మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి : ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్

 ఉట్నూర్ లో మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి :  ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్

ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లా ఉట్నూర్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 11న  నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇంపార్టికస్​సంస్థ ఈ జాబ్​మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఏదైనా డిగ్రీతో పాటు 50 శాతం మార్కులు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. 26 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సర్టిఫికెట్లతోపాటు ఆధార్, పాన్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9885762227, 9321825562 నంబర్లకు సంప్రదించాలన్నారు.