హైకోర్టు స్టేపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తం.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నయ్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైకోర్టు స్టేపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తం.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నయ్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • బీసీల నోటికాడికి వచ్చిన ముద్దను లాగేసుకున్నరు
  • గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్​ బిల్లులపై బండి సంజయ్, ఈటల, అర్వింద్ నోరు విప్పాలి
  • 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని వెల్లడి

నిజామాబాద్, వెలుగు : స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణలో మొదటిసారి కులగణన చేపట్టి.. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు తీసుకొస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌కు కడుపుమండి అడ్డుకుంటున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్​ మండిపడ్డారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే లోకల్​బాడీ ఎలక్షన్స్‌‌‌‌కు వెళ్తామని  తెలిపారు.  వెనుకబడిన వర్గాలను ముందువరుసలోకి తేవడానికి సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు.  

శనివారం మహేశ్‌‌‌‌ గౌడ్​ నిజామాబాద్‌‌‌‌లోని ఆర్అండ్​బీ గెస్ట్​హౌజ్‌‌‌‌లో  మీడియాతో చిట్​చాట్‌‌‌‌గా మాట్లాడారు.  ‘‘42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్​సిద్ధమైతే.. బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ కలిసి అడ్డుపడ్తున్నయ్​. బీసీల నోటిదాకా వచ్చిన ముద్దను లాగేశారు. లోకల్​ బాడీ ఎలక్షన్స్‌‌‌‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే రద్దు కోసం సుప్రీంకోర్టులో అప్పీల్​ చేయాలని సర్కారు నిర్ణయించింది. దేని ఆధారంగా రిజర్వేషన్లు పెంచారని అడిగితే శాస్త్రీయబద్ధంగా నిర్వహించిన కులసర్వే తాలూకు క్లియర్​ డేటా ​చూపేందుకు గవర్నమెంట్​ రెడీగా ఉన్నది” అని తెలిపారు. 

ఎన్నికలు ఎప్పుడు జరిగినా 42 శాతం రిజర్వేషన్​ అమలుకావాలనే రాహుల్​గాంధీ ఆశయాన్ని సక్సెస్​ చేసేందుకు సీఎం రేవంత్​ పనిచేస్తున్నారని చెప్పారు.  రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు ఢిల్లీలో ధర్నా నిర్వహించి.. రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తే తెలంగాణ నుంచి కాంగ్రెస్​ నేతలు మాత్రమే వెళ్లారని, బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ నాయకులు రాకుండా  వ్యతిరేకతను స్పష్టం చేశారని​ వ్యాఖ్యానించారు.  గవర్నర్​వద్ద పెండింగ్‌‌‌‌లో ఉన్న బిల్లులపై బీసీ నేతలైన కేంద్ర మంత్రి బండి సంజయ్​, ఎంపీ లు ఈటల రాజేందర్​, అర్వింద్​ ధర్మపురి నోరువిప్పాలని డిమాండ్​ చేశారు.  ఎవరెన్ని కుట్రలు చేసినా రిజర్వేషన్​ సాధించేదాకా పోరాడుతామని స్పష్టం చేశారు.

నిజామాబాద్​ టు ముంబైకి ప్రధాన రైలు మార్గం..

హైదరాబాద్​ నుంచి ముంబై వయా నిజామాబాద్​ ప్రధాన రైలు మార్గం కాబోతున్నదని మహేశ్​గౌడ్​ తెలిపారు. డబుల్​ లైన్​ నిర్మాణంతో రైళ్లు నడువబోతున్నాయని, పనులు స్పీడ్‌‌‌‌గా జరిగేలా ఎంపీలు చొరవ చూపాలని కోరారు. వేములవాడ మధ్య నుంచి కొండగట్టు, ధర్మపురి, లింబాద్రిగుట్ట, బాసర వరకు కొత్త రోడ్​ వేయాలని సీఎంను కోరామన్నారు. 

తెలంగాణ వర్సిటీలో గవర్నమెంట్​ ఇంజినీరింగ్​ కాలేజీ మంజూరు చేసిన సీఎం రేవంత్​రెడ్డి.. జిల్లా ప్రజల కోరిక మేరకు ఇప్పుడు అగ్రికల్చర్​ కాలేజీ కూడా శాంక్షన్​ చేశారని తెలిపారు.  జిల్లా కాంగ్రెస్​ ప్రెసిడెంట్ల ప్రాధాన్యతను ఢిల్లీ లెవెల్‌‌‌‌కు పెంచాలని హైకమాండ్​ నిర్ణయించిందని మహేశ్‌‌‌‌గౌడ్​ తెలిపారు.  సమర్థులను గుర్తించి డీసీసీ పోస్టు అప్పగించేందుకు ప్రత్యేక పరిశీలకులను ఏఐసీసీ అపాయింట్​ చేసిందన్నారు. 

ఈ టీం సభ్యులు ఆదివారం నుంచి వారంపాటు స్టేట్‌‌‌‌లోని జిల్లాల్లో పర్యటించి పేర్లను సేకరిస్తారని, వారిపై ఎవరి ఒత్తిళ్లు పనిచేయవన్నారు. వాయిదా పడ్డ కామారెడ్డి బీసీ సభను త్వరలో నిర్వహిస్తామని మహేశ్‌‌‌‌​గౌడ్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్​ కో ఆపరేటివ్​ డెవలప్‌‌‌‌మెంట్​ లిమిటెడ్​ చైర్మన్ మానాల మోహన్​రెడ్డి, అగ్రికల్చర్​ కమిషన్​ డైరెక్టర్ గడుగు గంగాధర్​, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులున్నారు.

మైల కడుక్కునే పనిలో హరీశ్‌‌‌‌ 

రాయలసీమను రతనాల సీమ చేస్తానని సీఎం హోదాలో ఏపీకి నాడు కేసీఆర్​ ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేయడానికి  ఇరిగేషన్​ మంత్రిగా ఉన్నప్పుడు హరీశ్‌‌‌‌రావు ​ బనకచర్ల నిర్మాణానికి అడ్డగోలు జీవోలు ఇచ్చారని మహేశ్‌‌‌‌ గౌడ్​ ఆరోపించారు. ఏపీ ప్రజల హక్కులు కాపాడడానికి తెలంగాణకు అన్యాయం చేశారని, ఇప్పుడవన్నీ బయటపడడంతో .. హరీశ్​రావు ఆ మైల కడుక్కునే పని షురూ చేశారని ఎద్దేవా చేశారు.