హుజూరాబాద్ బైపోల్.. ఇన్‌‌చార్జ్‌లను ప్రకటించిన బీజేపీ

హుజూరాబాద్ బైపోల్.. ఇన్‌‌చార్జ్‌లను ప్రకటించిన బీజేపీ

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం బీజేపీ సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ.. పకడ్బందీ వ్యూహాంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా హుజూరాబాద్ మండల ఇన్‌‌చార్జ్‌లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. హుజూరాబాద్ టౌన్‌కు ఎమ్మెల్యే రఘునందన్ రావు, రూరల్‌‌‌కు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని నియమించింది. అలాగే జమ్మికుంటకు ఎంపీ అర్వింద్, జమ్మికుంట రూరల్‌‌కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, వీణవంకకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, కమలాపూర్‌ మండలానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను ఇన్‌‌చార్జ్‌లుగా నియమించింది. బైపోల్ కోఆర్డినేటర్‌‌ బాధ్యతలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి అప్పగించింది.