విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ప్ర‌జ‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ విషయంలో ప్రజల సెంటిమెంట్ ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి వివరించినట్టుగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. సోమవారం నాడు సోమువీర్రాజు నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ‌డాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు సాగుతుండ‌డంపై సోము వీర్రాజు ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిశారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉన్న ప్రత్యామ్నాయ అంశాలను అన్నింటిని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని కేంద్ర మంత్రితో భేటీ అనంత‌రం సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను, వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళన ను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లామ‌ని చెప్పారు. గతంలో బ్యాంకులను నష్టాల బారినుండి గట్టెంక్కించేందుకు విలీనం చేసిన విధంగా …. స్టీల్ ప్లాంట్ ను విషయంలో విలీన ప్రతిపాదనలను కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు.