ఖిలా వరంగల్/ గ్రేటర్ వరంగల్, వెలుగు: కాకతీయుల శిల్పకళా సౌందర్యం అద్భుతమని నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి నసీమా అన్నారు. బుధవారం జడ్జి కుటుంబ సభ్యులు, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత కుటుంబ సభ్యులు, ఓరుగల్లు కోటను సందర్శించారు. పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి యాదవ్ కాకతీయుల శిల్పకళల గురించి వారికి వివరించారు. జిల్లా జడ్జితో వరంగల్ జ్యుడిషియల్ సిబ్బంది, మిల్స్ కాలనీ ఎస్సై శ్రావణ్ కుమార్, పర్యాటకులు తదితరులు ఉన్నారు.
