ఏం చేద్దాం..? : బీజేపీలో అంతర్మథనం

ఏం చేద్దాం..? : బీజేపీలో అంతర్మథనం
  • ఏం చేద్దాం..?
  • బీజేపీలో అంతర్మథనం
  • జనంలోకి వెళ్లని బీసీ సీఎం నినాదం
  • ఎస్సీ వర్గీకరణపై మోదీ ప్రకటనకూ దక్కని మైలేజ్
  • ఓటుగా కన్వర్ట్ కాకుంటే ఫాయిదా లేదు
  • రాష్ట్ర నాయకత్వంపై ద్వితీయ శ్రేణి అసంతృప్తి

హైదరాబాద్ :  కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ కీలక నేత బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించినా.. ఎస్సీ వర్గీకరణపై సాక్షాత్తూ మోదీ నర్మగర్భంగా హామీ ఇచ్చినా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలంగాణ బీజేపీ నాయకత్వం విఫలమైందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని, కేసీఆర్ సర్కారును గద్దె దించుతామని చెబుతున్న బీజేపీ స్టేట్ లీడర్స్ కార్యాచరణలో ఆ తెగువను చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గత నెల 27న రాష్ట్రానికి వచ్చిన హోంశాఖ మంత్రి అమిత్ షా.. సూర్యాపేట వేదికగా నిర్వహించిన జనగర్జన సభలో మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. 112 ఉపకులాలకు చెందిన బీసీ ఓటర్లున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో బీసీలే ఎక్కువ ఈ సామాజివర్గాన్ని ఆకట్టుకుంటే సీఎం సీటు వస్తుందనేది నిష్టుర సత్యం. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇదే ఉద్దేశంతో బీసీ సీఎం నినాదాన్ని తెరమీదకు తెచ్చింది. అమిత్ షా ప్రకటించిన తర్వాత  కేవలం రెండు మూడు రోజులు ఇద్దరు ముఖ్య నేతలు  మాత్రమే ఈ అంశాన్ని ప్రస్తావించి వదిలేశారు. ఇపై గాలికొదిలేశారనే విమర్శలున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసేలా రాష్ట్ర నాయకత్వం క్యాంపెయిన్ చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి.  దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు  కూడా ఆందోళన  వ్యక్తం చేశారు. 

మోదీ ప్రకటించినా పట్టించుకోలే..  

ఎస్సీ వర్గీకరణ కోసం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో  మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిర్వహించగా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్​ తదితరులు హారయ్యరు. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ సాక్షాత్తూ ప్రధాన మంత్రే ఇండికేషన్లు ఇచ్చినా ఈ విషయాన్ని ఆ పామాజిక వర్గానికి చేరవేయడంలో రాష్ట్ర భారతీయ జనతాపార్టీ నాయకత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఎస్సీల్లో మాదిగ ఉపకులాలకు చెందిన వారే ఎక్కువంగా ఉన్నారు. వర్గీకరణ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది. అయితే ఇటీవలే  రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఎస్సీ వర్గీకరణపై ఓ క్లారిటీ ఇచ్చారు. దీనికి మందకృష్ణ మాదిగ ఉద్వేగానికి లోనయ్యారు. అయితే ఇంత జరిగినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎస్సీ వర్గీకరణను ప్రచారారాస్త్రంగా మార్చుకోలేక పోతోందనే విమర్శలున్నాయి. రాష్ట్ర నాయకత్వం తీరుపై ద్వితీయ శ్రేణి నాయకులు అలకబూనినట్టు తెలుస్తోంది.

ALSO READ :- వీలైతే చొక్కాలు చింపుకొని సినిమా చూడాలే..టపాసులు కాల్చుతూ కాదు..నెటిజన్స్ వార్నింగ్