ఆకట్టుకుంటున్న పిట్టలదొర స్కిట్: సాలుదొర.. సెలవు దొరకు విశేషాదరణ

ఆకట్టుకుంటున్న పిట్టలదొర స్కిట్: సాలుదొర.. సెలవు దొరకు విశేషాదరణ
  • ఆకట్టుకుంటున్న పిట్టలదొర స్కిట్
  • సాలుదొర..సెలవు దొరకు విశేషాదరణ
  • యూట్యూబ్ లో 4 కోట్ల వ్యూస్
  • ఫేస్ బుక్ లోనూ పెరిగిన ఆదరణ

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖ రూపొందించిన సాలుదొర... సెలవు దొర వీడియోలకు యూట్యూబ్ లో విశేషాదరణ లభిస్తోంది. పిట్టల దొర అంటే అందరికీ తుపాకీ రాముడనే తెలుసు. కానీ బీజేపీ మాత్రం తుపాకీ చంద్రుడిని చూపిస్తోంది. కేసీఆర్ హామీలు.. అమలవుతున్న తీరును కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. వీటిని ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్లో ఈ వీడియోలు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. 

భూనిర్వాసితులు. ప్రాజెక్టుల కోసం, మహిళలకు రక్షణ,భూసేకరణ, మహిళల భద్రత, నిరుద్యోగులకు  కొలువులు, దళితబంధు తదితర పథకాలపై రూపొందించిన వీడియోలు  ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.   కేవలం యూట్యూబ్ వేదికగా ఇప్పటి  వరకు   4 కోట్ల వ్యూస్ వచ్చాయి.  దీంతో పాటు  ఫేస్ బుక్ , వాట్సాప్, ట్విట్టర్లో ఈ వీడియోలు  ట్రెండింగ్ లో ఉండటం విశేషం.

ప్రాజెక్టుల కోసం,భూసేకరణ, మహిళల బద్రత, నిరుద్యోగి మిర్చి బండి ఇతి వృత్తాలతో  రూపొందించిన ఈ వీడియోలు  ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.  దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో కేసీఆర్ చేసిన  వాగ్దానాన్ని  రూ. 10లక్షల దళితబందు  ఆర్థిక సాయం అంశాన్ని సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో చిత్రీకరించారు. నిరుద్యోగి మిర్చి బండి వద్దకు వచ్చిన కొలువులు విషయం చెప్పిన తర్వాత మిర్చీ తిని రూ.500 నోటు స్థానంలో 420 ఫేక్ నోటు ఇవ్వడం కడుపుబ్బా నవ్విస్తోందనే అభిప్రాయం వ్యక్తమైంది.

మహిళల రక్షణ అంశంపై ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటుండగా తుపాకీ చంద్రుడు దూరి తాను గ్యారెంటీ అని చెప్పడం... ఇప్పటి వరకు జరిగింది చాలు.. తొమ్మిదేండ్లు అనుభవించినం. సాలు దొర. ఇక సెలవు దొర అంటూ దండం పెట్టి పంపడం న్యాచురల్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది.