కుత్బుల్లాపూర్​లో బీజేపీ గెలుపు ఖాయం : కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్​లో బీజేపీ గెలుపు ఖాయం :  కూన శ్రీశైలం గౌడ్

జీడిమెట్ల,  వెలుగు: కుత్బుల్లాపూర్​ నియోజక వర్గంలో కమలం వికసించడం ఖాయమని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్​ అన్నారు.  సోమవారం ఆయన సుభాష్​చంద్రబోస్​నగర్​, శ్రీరామ్​నగర్​లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి నగర్‌‌‌‌‌‌‌‌లో 50  మంది యువకులు బీజేపీ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వనించారు.  అనంతరం మాట్లాడుతూ..   కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు.  

ఈసారి  బీజేపీ జెండా ఎగరవేస్తామని  ధీమా వ్యక్తం చేశారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ  స్కీముల పేరిట అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. పది సంవత్సరాల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ చేసిన మోసాలను ప్రజలు గుర్తించాలని  కోరారు.  ఎన్నికల్లో  కల్లబొల్లి హమీలు ఇస్తున్న కాంగ్రెస్​ను, ప్రజలను మోసం చేసే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు బుద్ధి చెప్పి బీజేపీని  గెలిపించాలని ఆయన  కోరారు.