సుధీర్ రెడ్డి, మధు యాష్కీ ఇద్దరూ ఒక్కటే : సామ రంగారెడ్డి

సుధీర్ రెడ్డి, మధు యాష్కీ ఇద్దరూ ఒక్కటే : సామ రంగారెడ్డి

ఎల్​బీనగర్, వెలుగు : బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ ఇద్దరూ ఒక్కటేనని ఎల్ బీనగర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం వనస్థలిపురం, మన్సూరాబాద్, చైతన్యపురి డివిజన్లలో కార్పొరేటర్లు రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, కొప్పుల నర్సింహా రెడ్డి, నర్సింహా గుప్తాతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ..

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాదిరిగా తాను నీతిమాలిన రాజకీయాలు చేయట్లేదన్నారు. ఆయన తీరును చూస్తే ఊసర వెల్లి సైతం సిగ్గుపడుతుందన్నారు. అక్రమాలపై ప్రశ్నించిన వారిపై ఆయన దాడులు చేయిస్తాడని ఆరోపించారు.  అందుకే కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని సామ రంగారెడ్డి కోరారు.