V6 News

బీజేపీ ఇంకా అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేయలే: ప్రేమేందర్రెడ్డి

బీజేపీ ఇంకా అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేయలే: ప్రేమేందర్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తాము ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పలు నియోజకవర్గాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించినట్లు మీడియా,  సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తి నిరాధారమైనవని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటిదాకా పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని ప్రేమేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అభ్యర్థులను ఖరారు చేస్తే అధికారికంగానే ప్రకటిస్తామని చెప్పారు. అసత్యమైన వార్తలతో బీజేపీ నాయకులు,       కార్యకర్తలు ఆందోళన చెందొద్దన్నారు.