ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటీ.. కవితకు నోటీసులపై కిషన్ రెడ్డి స్పందన

ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటీ.. కవితకు నోటీసులపై కిషన్ రెడ్డి స్పందన

బీఆర్ఎస్ (mlc kavita) ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు (kishan reddy). లిక్కర్ దందా చేసింది మీరు.. అక్రమంగా కోట్లు సంపాదించింది మీరు.. దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీలపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారాయన. (delhi liquor scam)ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటీ అని నిలదీశారాయన. తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి. చేసిన తప్పులు అన్నీ చేసి.. మీ తప్పులపై నోటీసులు ఇస్తే.. తెలంగాణ సమాజానికి ముడిపెట్టి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.   

ఈడీ, సీబీఐ (arun pillai) లాంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం పెట్టలేదని.. అవి ఎప్పటి నుంచో ఉన్నాయన్నారు. ఈడీ నోటీసులతో బీజేపీకి ఏం సంబంధం అని నిలదీశారాయన. చట్టం ముందు అందరూ సమానమే అని.. దర్యాప్తు సంస్థల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవన్నారు (arun pillai), (ED) కిషన్ రెడ్డి. మీ బెదిరింపులకు భయపడం అని.. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే.. కేంద్రం చాలా బాగా పరిపాలిస్తుందన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు.. తెలంగాణ సమాజాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని.. ఇలాంటి ఆటలు ఇక సాగవన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. (delhi liquor scam)ఈడీ, సీబీఐ చూసుకుంటున్నాయన్నారు. విచారణలో భాగంగా అందరికీ నోటీసులు (ED) ఇచ్చారని.. కేవలం కవితకు మాత్రమే నోటీసులు ఇవ్వలేదన్న విషయాన్ని ప్రస్తావించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి