భారత్‌కు ట్రంప్ సర్కార్ గుడ్‌న్యూస్: 50% నుంచి 25 శాతానికి తగ్గనున్న టారిఫ్స్..!

భారత్‌కు ట్రంప్ సర్కార్ గుడ్‌న్యూస్: 50% నుంచి 25 శాతానికి తగ్గనున్న టారిఫ్స్..!

ప్రపంచంలో మరే దేశంపైనా లేనంత భారీ టారిఫ్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దాయాది దేశం పాక్ కంటే కూడా అధికంగా పన్నులు ఉండటంతో ఎగుమతులు భారీగా దెబ్బతింటున్నాయి. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నామంటూ అదనపు సుంకాల తర్వాత మెుత్తంగా 50 శాతం దిగుమతి పన్నులు అమెరికాలో భారతీయ వస్తువులకు డిమాండ్ తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ టాక్స్ సానుకూల దిశకు చేరుకుంటున్నట్లు తాజా అప్ డేట్ ప్రకారం తెలుస్తోంది. 

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్‌పై విధిస్తున్న వాణిజ్య సుంకాలను సగానికి సగం తగ్గించే దిశగా కీలక సంకేతాలు వచ్చాయి. గతంలో విధించిన 50 శాతం టారిఫ్‌లను 25 శాతానికి తగ్గించే అవకాశాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులను తగ్గించుకుందనే కారణాన్ని చూపుతూ.. ఈ ఉపశమనం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ALSO READ : గంటన్నర హాస్పిటల్ బిల్లు రూ. 1.5 లక్షలా ?

గత ఏడాది ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై రెండు విడతలుగా సుంకాలను విధించింది. వాణిజ్య అసమతుల్యత కారణంగా 25 శాతం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షాత్మక చర్యగా మరో 25 శాతం టారిఫ్‌లను విధించడంతో భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఇటీవల భారత్ రష్యా చమురు దిగుమతులను భారీగా తగ్గించుకుందని.. అందుకే ఈ 25 శాతం సెకండరీ సుంకాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని బెస్సెంట్ పేర్కొన్నారు.

ALSO READ : గోల్డెన్ డోమ్ వద్దంటే.. చైనా మిమ్మల్ని మింగేస్తుంది

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఆయన మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని, కానీ ట్రంప్ సుంకాలు విధించిన తర్వాత భారత్ ఆ కొనుగోళ్లను క్రమంగా తగ్గించిందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్ తీరును విమర్శించారు. భారత్ నుంచి రిఫైన్ చేసిన ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తూనే.. పెద్ద వాణిజ్య ఒప్పందం కోసం సుంకాలు విధించకుండా ఉండటం తెలివితక్కువతనం అని అన్నారు.

ALSO READ : యుద్ధం ముంగిట ఇరాన్..

మరోవైపు.. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన ఇంధన విధానం జాతీయ ప్రయోజనాల ప్రకారమే ఉంటుందని గతంలోనే స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించలేదని అధికారికంగా చెప్తున్నప్పటికీ.. ప్రైవేట్ సంస్థలు మాత్రం దిగుమతులు తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా తాజా నిర్ణయం అమలైతే, భారత ఎగుమతిదారులకు భారీ ఉపశమనం లభించడంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశం ఉంది.