గోల్డెన్ డోమ్ వద్దంటే.. చైనా మిమ్మల్ని మింగేస్తుంది: కెనడాకు ట్రంప్ వార్నింగ్

గోల్డెన్ డోమ్ వద్దంటే.. చైనా మిమ్మల్ని మింగేస్తుంది: కెనడాకు ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాపై విరుచుకుపడ్డారు. తాము నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ ను వ్యతిరేకిస్తే చైనా  మింగేస్తుందని  హెచ్చరించారు. తను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రక్షణ కవచాన్ని వ్యతిరేకిస్తూ కెనడా తప్పు చేస్తోందని.. దానికి మూల్యం చెల్లించుకుంటుందని ఘాటు విమర్శలు చేశారు. అమెరికాను కాదని చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే త్వరలోనే ఆ కమ్యూనిస్టు దేశం కెనడాను మింగేస్తుందని హెచ్చరించారు. 

గ్రీన్ లాండ్ మీదుగా మేము అత్యంత ప్రతిష్టాత్మకమైన భద్రతా కవచం  నిర్మిస్తున్నాం. గోల్డెన్ డోమ్ కెనడాను కూడా కాపాడుతుంది. దీన్ని కాదని.. చైనాతో వ్యాపారం సంబంధం పెట్టుకుంటే అది మిమ్మల్ని మింగేస్తుంది.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

ALSO READ : ఇరాన్ వైపు అమెరికాయుద్ధనౌకలు ..

మిస్సైల్స్ దాడిని తిప్పికొట్టేలా గగన తలంలో ఏర్పాటు చేసే రక్షణ కవచమే గోల్డెన్ డోమ్. ఉత్తర అమెరికాను ఇది భద్రతాపరమైన గొడుగులా కాపాడుతుంది. డెన్మార్క్ భూభాగమైన గ్రీన్ లాండ్ మీదుగా గోల్డెన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బాలిస్టిక్, హైపర్ సోనిక్ మిసైళ్లతో పాటు ఇతర అధునాతన మిస్సైల్ దాడుల నుంచి దేశాన్ని రక్షించేందుకు, తిప్పి కొట్టేందుకు ఈ రక్షణ కవచం ఉపయోగపడుతుంది. 

ALSO READ : యుద్ధం ముంగిట ఇరాన్..

తాము నిర్మించబోయే రక్షణ కవచం కెనాడాను కూడా కాపాడుతుందని.. ఈ విషయంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ తమకు రుణపడి ఉండాలని అన్నారు ట్రంప్. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మాట్లాడుతూ.. కెనడాకు తాము ఎన్నో ఉచితాలు అందిస్తున్నాం. ఈ విషయంలో మాకు రుణపడి ఉండాలి.కానీ దానికి వ్యతిరేకంగా చైనాతో జట్టు కడుతూ పులినోట్లో తలకాయ పెట్టినట్లుగా వాళ్ల నిర్ణయం ఉందని విమర్శించారు. 

కెనడా-చైనా వాణిజ్య ఒప్పందం:

చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది కెనడా. తమ దేశ కంపెనీలకు 7 బిలియన్ డాలర్ల ఎగుమతికి అవకాశం ఇచ్చేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కెనడా పీఎం కార్నీ ప్రకటించారు. ఈ డీల్ ప్రకారం చైనా ఎలక్ర్టిక్ వెహికిల్స్ పై 100 శాతం టారిఫ్ లను తగ్గించింది. మొదటగా 49 వేల యూనిట్లను దిగుమతి చేసుకుంటుండగా.. ఆ తర్వాత 5 ఏళ్లలో 70 వేల యూనిట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ALSO READ : కెనడాకు పంపిన ఆహ్వానం వెనక్కి..

ఈ సందర్భంగా మాట్లాడిన కార్నీ.. చైనాతో వాణిజ్యం అమెరికాతో పోల్చితే నమ్మదగినదని పేర్కొన్నారు.  అమెరికా తమ దేశ వస్తువులపై 35 శాతం, లోహాలపై 50 శాతం, ఆటో కంపెనీ ఉత్పత్తులపై25 శాతం టారిఫ్ లను విధిస్తోందని.. కానీ చైనాతో పరస్పర సహకార వాతావరణం ఉంటుందని అన్నారు.