ఈ ఏడాదే కేసీఆర్ ఖేల్ ఖతం:  బండి సంజయ్ 

ఈ ఏడాదే కేసీఆర్ ఖేల్ ఖతం:  బండి సంజయ్ 

కేసీఆర్ నువ్వు అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా.. నీకు రాజీనామా చేసే దమ్ముందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. డేట్, టైం ఫిక్స్ చేస్తే తాను బహిరంగ చర్చకు సిద్ధమని కేసీఆర్ కు ఆయన సవాల్ చేశారు. రైతుల వద్దకు పోయి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చెప్పే దమ్ముందా అని నిలదీశారు. రైతులంతా కేసీఆర్ ను ఉరికించి కొడతారని హెచ్చరించారు. దేశ జీడీపీ గురించి కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలె.. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా మనం ఎదిగినమన్నారు. హామీల అమలు విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసెంబ్లీలో అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. 

కేసీఆర్ నువ్వో పెద్ద డిఫాల్టర్ ముఖ్యమంత్రివి... నీ మాటలు నమ్మేదెవరని బండి సంజయ్ మండిపడ్డారు. 56 వేల జీవోలు దాచిన నువ్వు మోడి పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందని ప్రశ్నించారు. పహిలీ బార్ దళిత్ సర్కార్ ఎంత నిజమో.. అబ్ కీ బార్ ఆబ్కారీ సర్కార్ అంతే నిజమని పేర్కొన్నారు. అబద్దాలతో అసెంబ్లీని మలినం చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. ఈ ఏడాదే కేసీఆర్ ఖేల్ ఖతం కాబోతోందని తెలిపారు.